
గాసిప్స్

భారత్‌లో కొనసాగుతున్న టీ20 క్రికెట్ వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్న అమెరికా క్రికెట్ జట్టుకు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. జట్టు సభ్యులకు దేశం మొత్తం మద్దతుగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్,
“భారత్‌లో క్రికెట్ వరల్డ్‌కప్ జరుగుతోందని ఇప్పుడే తెలిసింది. టీమ్ యూఎస్ఏకు నా శుభాకాంక్షలు. మనకు చాలా బలమైన జట్టు ఉంది. అమెరికా మొత్తం మీ వెంటే ఉంది” అని సందేశం పోస్టు చేశారు.

ఈ పోస్టుకు భారతదేశంలోని అమెరికా రాయబారి సర్జియో గోర్ స్పందిస్తూ,
“మీ ప్రోత్సాహకరమైన మాటలకు ధన్యవాదాలు గౌరవనీయ అధ్యక్షులుగారు” అంటూ కృతజ్ఞతలు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!