

దేశ సముద్ర సరిహద్దుల రక్షణతో పాటు అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రతలో భారత నేవీ కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. విశాఖపట్నం తీరంలో ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో ఆమె పాల్గొని ఐఎన్ఎస్ సుమేధ నౌకలో ప్రయాణిస్తూ 71 యుద్ధనౌకల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.
వివిధ దేశాల నౌకాదళ అధికారులను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ దేశాల మధ్య స్నేహబంధాలను బలోపేతం చేయడంలో భారత నేవీ ముఖ్య పాత్ర పోషిస్తోందన్నారు. వివిధ దేశాల జెండాలతో అలంకరించిన యుద్ధనౌకలు ఐకమత్యం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు. సముద్రాల ద్వారా ప్రపంచ దేశాలు అనుసంధానమై ఉన్నాయని పేర్కొంటూ ‘మహాసాగర్’ విధానానికి ఐఎఫ్ఆర్ కార్యక్రమం మరింత బలాన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సముద్రాలతో భారతదేశానికి శతాబ్దాల నాటి బంధం ఉందని గుర్తుచేస్తూ, సముద్ర మార్గాలు వాణిజ్యానికి మరియు దేశాల మధ్య సంబంధాల అభివృద్ధికి కీలకమని ఆమె పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!