

గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా మరమ్మతులు, లైన్ మెయింటెనెన్స్ పనులు, చెట్ల కొమ్మల తొలగింపు వంటి కారణాల వల్ల వివిధ సబ్ స్టేషన్ల పరిధిలో కరెంట్ అంతరాయం తప్పదని అధికారులు వినియోగదారులకు సూచించారు.
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ వంశీకృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం, ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ ఎస్ఆర్టీ నగర్, బంజారా నగర్, స్వరాజ్ నగర్ ఫీడర్ల కింద ఉన్న ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అదే విధంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు 11 కేవీ ఆర్బీఐ ఫీడర్ పరిధిలోని పలు కాలనీలలో కరెంట్ ఉండదు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ మహాత్మా నగర్ మరియు హిందూ ఫీడర్ పరిధిలో కూడా విద్యుత్ నిలిపివేయనున్నారు.
అల్లాపూర్ డివిజన్లో చెట్ల కొమ్మల తొలగింపు కార్యకలాపాల కారణంగా కూడా విద్యుత్ అంతరాయం చోటుచేసుకోనుందని ఏఈ రాకేష్ గౌడ్ తెలిపారు. 11 కేవీ పద్మావతి నగర్ ఫీడర్ పరిధిలోని జేకే పాయింట్ హోటల్ పరిసరాలు, రాణా ప్రతాప్ నగర్, రాధాకృష్ణ సొసైటీ, థామస్ స్కూల్ వద్ద, శివబస్తీ, కొత్తూరి సీతయ్య నగర్ మరియు దర్గా ఏరియాల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కరెంట్ ఉండదు.
కేపీహెచ్‌బీ కాలనీలో కూడా టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో విద్యుత్ నిలిపివేత ఉంటుంది. ఏఈ భీమాలింగప్ప తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు రాందేవ్రావు హాస్పిటల్, ఆకార్ ఆషా హాస్పిటల్, శివానంద రిహాబిలిటేషన్ సెంటర్, బిగ్ సీ మొబైల్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, విజేత సూపర్ మార్కెట్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. తదుపరి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు మూసాపేట్ వార్డు ఆఫీస్, గూడ్షెడ్ రోడ్డు, యాదవ బస్తీ, అంబేద్కర్‌నగర్, ఎస్పీ నగర్, జేపీ నగర్ ప్రాంతాల్లో కరెంట్ ఉండదు.
చిక్కడపల్లి పరిధిలో కూడా గురువారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈలు నాగేశ్వరరావు, వినోద్‌కుమార్ ప్రకటించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు రామాలయం, ఎల్ఎన్నగర్, ప్రివెంటివ్ మెడిసిన్, అంజయ్య భవన్, భోలక్‌పూర్, గోశాల, ఈనాడు మరియు గాంధీనగర్ ఫీడర్ల కింద విద్యుత్ నిలిచిపోతుంది.
మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు సాయిబాబా టెంపుల్, శంకరమఠం, నారాయణగూడ, తాళ్లబస్తీ ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేయబడుతుంది.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!