
ఆరోగ్యం

జగిత్యాల జిల్లా రూరల్ మండలం మోరపెల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సమాచారం ప్రకారం, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను మొబైల్ ఫోన్‌లో చూస్తూ ప్రయాణిస్తున్న థార్ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బావిలోకి దూసుకెళ్లింది. వాహనంలో నివేష్, అశ్విన్, అరుణ్ ప్రయాణిస్తుండగా, భారీ శబ్దం విని సంఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్థులు ఇద్దరిని సురక్షితంగా బయటకు తీశారు.
అయితే వాహనం నడుపుతున్న అరుణ్ బావిలోనే చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టగా, దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన ఆపరేషన్ అనంతరం కారుతో పాటు చిక్కుకున్న అరుణ్ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపగా, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం ఎంత ప్రమాదకరమో మరోసారి గుర్తు చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!