

రామ్ చరణ్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే హిందీ సహా ఇతర భాషల మార్కెట్లలో ఇంకా భారీ స్థాయి ఉత్సాహం కనిపించడం లేదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విడుదల కానున్న ట్రైలర్ సినిమాకు కీలకంగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
పెద్ది ట్రైలర్‌లో భావోద్వేగాలు, యాక్షన్, భారీ విజువల్స్, ప్రేక్షకులను ఆకట్టుకునే డైలాగ్‌లు సమతూకంగా ఉంటే పాన్ ఇండియా స్థాయిలో సినిమాపై ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వచ్చే స్పందనతో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సినిమాపై ఉన్న అంచనాలను ప్రతిబింబించనున్నాయి. విడుదలకు ముందు పెద్ది ట్రైలర్ సినిమాను మరింత హైప్‌లోకి తీసుకెళ్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!