

యాదగిరి జిల్లాలో స్వయం ఘోషిత దేవమానవుడు మల్లికార్జున ముత్యాపై పోక్సో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు శహపుర తాలూకా గోగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఒక బాలికతో అనుచితంగా ప్రవర్తిస్తున్న వీడియోలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సహా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సంఘటన సమయంలో అక్కడే ఉన్న భక్తులు ఎవరూ అడ్డుకోకపోవడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. బాలల రక్షణ కమిషన్ కూడా ఈ వ్యవహారంపై పోలీసుల నుంచి వివరాలు కోరింది.
వైరల్ వీడియోల్లో బాలిక గొంతు పట్టుకుని మంచంపై తోసివేయడం, శరీరాన్ని తాకుతూ డ్యాన్స్ చేయడం, ముక్కు పిండడం వంటి దృశ్యాలు కనిపించాయి. రోజామహల్కు చెందిన ముత్యా తనను తాను నడిచే దేవుడిగా ప్రచారం చేసుకుంటూ ‘అప్పాజీ’గా భక్తుల్లో ప్రాచుర్యం పొందాడు. అయితే తాను బాలికను కుమార్తెగా భావించి సరదాగా మాట్లాడానని అతడు వివరణ ఇచ్చాడు. పోలీసులు పిలిస్తే హాజరవుతానని తెలిపినా, కేసు నమోదు అనంతరం మఠం నుంచి అదృశ్యమైనట్లు సమాచారం. అతడు హైదరాబాద్ ద్వారా తెలంగాణలోని మరో ప్రాంతానికి వెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!