

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఎక్స్ ఖాతా బ్లాకింగ్‌కు సంబంధించిన పిటిషన్‌ను పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖ (మిటీ) పరిధిలోని రివ్యూ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే దాఖలు చేసిన పిటిషన్లో, జాతీయ భద్రతా కారణాలను చూపుతూ కేంద్ర ప్రభుత్వం తమ ఎక్స్ ఖాతాను నిలిపివేసిందని, అలాగే అనుబంధ సోషల్ మీడియా ఖాతాలు, వెబ్సైట్ కూడా ప్రభావితమయ్యాయని పేర్కొన్నారు.
ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పురుషేంద్ర కుమార్ కౌరవ్, చట్టప్రకారం ఫిర్యాదును పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని రివ్యూ కమిటీని ఆదేశించారు. నిరుద్యోగం, పాలన, రాజకీయ జవాబుదారీతనం వంటి అంశాలపై పోస్టుల ద్వారా సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన సీజేపీ ఖాతా ఇటీవల నిలిపివేయబడింది. ఈ చర్య భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందని అభిజీత్ దీప్కే వాదిస్తూ ఖాతాను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!