

మలేషియా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నిర్వహించిన ప్రవాస భారతీయుల సభలో తెలంగాణ సంస్కృతి ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మలేషియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో, మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MAITA) ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. బతుకమ్మ సంబరాలు, బోనాల ఉత్సవం, లంబాడీ నృత్యాలు తెలంగాణ సంప్రదాయ వైభవాన్ని అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించాయి.
ఈ ప్రదర్శనను కేవలం ఏడు నిమిషాల నిడివిలో, అతి తక్కువ సమయంలో సిద్ధం చేసి విజయవంతంగా ప్రదర్శించిన మైటా మహిళా సభ్యులను మైటా అధ్యక్షులు సైదం తిరుపతి ప్రత్యేకంగా అభినందించారు. ప్రపంచ స్థాయిలో తెలంగాణ అస్తిత్వాన్ని చాటినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైటా కోర్ కమిటీ సభ్యులు, సంస్థ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు పాల్గొని ప్రధాని మోదీకి తమ మద్దతు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!