

గీతం యూనివర్సిటీకి తెలంగాణ హైకోర్టు నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ బకాయిల అంశంలో హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్లోని గీతం యూనివర్సిటీకి అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేశారు. దీంతో సుమారు 8 వేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని యూనివర్సిటీ యాజమాన్యం మరోసారి కోర్టును ఆశ్రయించింది.
ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మొత్తం రూ.118 కోట్ల విద్యుత్ బకాయిల్లో కనీసం సగం మొత్తాన్ని చెల్లిస్తేనే కరెంట్ కనెక్షన్ పునరుద్ధరణకు ఆదేశాలు ఇస్తామని కోర్టు తేల్చి చెప్పింది. బకాయిలు చెల్లించకుండా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ సాధ్యం కాదని స్పష్టం చేసింది.
ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. కాగా, గీతం యూనివర్సిటీ రూ.118 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ ఇటీవల డిస్కం అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టు తాజా ఆదేశాలతో యూనివర్సిటీ యాజమాన్యంపై ఆర్థిక ఒత్తిడి మరింత పెరిగినట్లు కనిపిస్తోంది.






.webp&w=3840&q=75)


.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!