
గాసిప్స్

హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే బస్సులకు భారీ డిమాండ్ ఏర్పడింది. నగరంలోని బస్ స్టాండ్లు కిటకిటలాడుతుండగా, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా కనిపిస్తోంది. స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ప్రజా రవాణా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది.
ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీజీఆర్టీసీ) మొత్తం 6,431 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తుండగా, ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు టికెట్ ధరలను మూడు రెట్లు వరకు పెంచినట్లు తెలుస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!