

పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF)గా ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ నియమితులయ్యారు. పాక్ షెహబాజ్ ప్రభుత్వం ఈ నియామకానికి ఆమోదం తెలిపింది, మరియు పాకిస్తాన్ అధ్యక్ష కార్యాలయం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకంతో ఆసిమ్ మునీర్ పాకిస్తాన్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా నిలవనున్నారు. ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
సీడీఎఫ్ గా, మునీర్ న్యాయ పరమైన విషయాల్లో అధ్యక్షుడితో సమాన స్థాయిలో సెక్యూరిటీని కూడా పొందనున్నారు. అంతేకాదు, ఈ పదవిలో ఉన్నంతకాలం ఆయనను ప్రాసిక్యూట్ చేసే అవకాశం కూడా ఉండదు.
పాక్ ఆర్మీ చీఫ్ గా మునీర్ పదవీకాలం నవంబర్ 29తో ముగిసింది. ఆయనకు మరిన్ని అధికారాలను కట్టబెడుతూ సంకీర్ణ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఇందుకోసమే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ పోస్టును క్రియేట్ చేసింది. సీడీఎఫ్ గా మునీర్ ను ప్రకటించే ముందు.. ఆ పదవిపై పలు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. పాక్ ప్రధాని షెహ్ బాజ్ షరీఫ్ కావాలనే మునీర్ నియామకాన్ని ఆలస్యం చేస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రభుత్వం, సైన్యం మధ్య నెలకొన్న విభేదాలే ఇందుకు కారణమని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!