జీహెచ్ఎంసీ పరిధిని అవుటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వరకు విస్తరించిన నేపథ్యంలో, పరిపాలనను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కి పెంచుతూ, అలాగే 30గా ఉన్న సర్కిల్స్ సంఖ్యను 60కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పునర్వ్యవస్థీకరణలో ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్లను కొత్త జోన్లుగా ఏర్పాటు చేశారు. సర్కిల్ ఆఫీసుల నుంచే కొత్త జోనల్ కార్యాలయాలు పనిచేయనున్నాయి. అలాగే వార్డు కార్యాలయాల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేసి, అక్కడి నుంచే పరిపాలనా కార్యకలాపాలు ప్రారంభించనున్నారు.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!