
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులకు సోమవారం కీలక సూచనలు జారీ చేసింది. రాయబార కార్యాలయాన్ని ముందుగా సంప్రదించకుండా దేశం విడిచి వెళ్లేందుకు ఏ భూ సరిహద్దుల వైపు ప్రయాణించవద్దని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎక్స్ (X) వేదికగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
భారత పౌరులు ఎంబసీ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు పొందిన తర్వాతే సరిహద్దుల వైపు ప్రయాణించాలని రాయబార కార్యాలయం సూచించింది. ఒకవేళ ఇరాన్ భూభాగం విడిచి వెళ్లి పొరుగు దేశంలోకి ప్రవేశం లభించక ఇబ్బందులు ఎదురైతే, ఆ తర్వాత సహాయం అందించడం కష్టమవుతుందని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్ నంబర్లు లేదా ఈ-మెయిల్ ద్వారా ఎంబసీని సంప్రదించాలని భారతీయులకు సూచించింది.





.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!