

చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు తమిళ, హిందీ, తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన సారా అర్జున్ ఇటీవల సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతోంది. 'టాక్సిక్' సినిమా వాయిదా పడిన నేపథ్యంలో “టాక్సిసిటీ లేదు, ధురంధర్ మాత్రమే” అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో ఆమె పోస్ట్ పెట్టినట్టు ప్రచారం జరిగింది. దీంతో కొందరు నెటిజన్లు మరో సినిమాను తక్కువ చేసి తన చిత్రాన్ని ప్రమోట్ చేసిందని విమర్శించారు. ఈ ప్రచారంపై స్పందించిన సారా తండ్రి అర్జున్, సారాకు ఎక్స్ లేదా ట్విట్టర్లో ఎలాంటి అధికారిక ఖాతా లేదని స్పష్టం చేశారు. ఆమె కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే యాక్టివ్‌గా ఉంటుందని తెలిపారు.
తన సినిమా ప్రచారం కోసం ఇతర సినిమాలను కించపరచే ఆలోచన సారాకు ఎప్పుడూ ఉండదని ఆయన చెప్పారు. సినిమా రంగాన్ని ఒక పెద్ద కుటుంబంగా భావిస్తున్నామని, ప్రతి నటుడు మరియు ప్రతి చిత్రానికి సారా గౌరవం ఇస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా కాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ చబ్రా కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. ఇంతియాజ్ అలీ తదుపరి చిత్రానికి సారా అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు నిజం కాదని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఏ కొత్త సినిమాకు సైన్ చేయలేదని, ‘ధురంధర్ 2’ విడుదల తర్వాతే తదుపరి ప్రాజెక్ట్‌పై నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!