
న్యూస్

హార్మూజ్ జలసంధి మూసివేతకు సంబంధించిన ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం ఈ కీలక సముద్ర మార్గం ద్వారానే జరుగుతుండటంతో పరిస్థితి తీవ్రంగా మారే అవకాశముంది. ముఖ్యంగా భారత్కు వచ్చే చమురులో సుమారు 35 నుంచి 50 శాతం వరకు హార్మూజ్ మార్గంపైనే ఆధారపడుతున్నట్లు అంచనాలు సూచిస్తున్నాయి.
హార్మూజ్ జలసంధి మూసివేయబడితే చమురు నౌకలు ప్రత్యామ్నాయంగా మరింత పొడవైన మార్గాలు ఎంచుకోవాల్సి వస్తుంది. దీంతో రవాణా ఖర్చులు, బీమా వ్యయాలు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలకు దారితీసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!