

మహారాష్ట్ర బీడ్ జిల్లా సాంగ్వీ పాటన్ అనే చిన్న గ్రామంలో జన్మించిన భగత్ జీవితం పేదరికంతోనే మొదలైంది. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబంలో పెరిగిన అతడు, కష్టాలే తన రోజువారీ జీవితంగా మారిన వాతావరణంలో ఎదిగాడు. చదువుపై ఆసక్తి ఉన్నా ఆర్థిక పరిస్థితులు అడ్డు రావడంతో ఐటీఐ డిప్లొమాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కుటుంబ బాధ్యతలు పెరగడంతో ఉద్యోగం కోసం పుణెకు వెళ్లిన భగత్, ఇన్ఫోసిస్‌లో ఆఫీస్‌బాయ్‌గా నెలకు రూ.4,000 జీతంతో పని మొదలుపెట్టాడు. ఆ ఉద్యోగం అతడికి జీవనోపాధినిచ్చినా, కలల్ని మాత్రం ఆపలేకపోయింది.
యానిమేషన్‌పై ఉన్న ఆసక్తిని వదులుకోకుండా, పగటిపూట పని చేస్తూనే రాత్రివేళల్లో కోర్సులు పూర్తి చేశాడు. డిజైన్, గ్రాఫిక్స్ రంగంలో అనుభవం సంపాదిస్తూ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. ఈ ప్రయాణంలో ఎదురైన బైక్ ప్రమాదం కొంతకాలం అతడిని ఆపినా, లక్ష్యంపై ఉన్న పట్టుదల తగ్గలేదు. కోలుకుంటూనే నింతా మోషన్ పేరుతో యానిమేషన్ సేవలను ప్రారంభించి, తన ఆలోచనలకు రూపం ఇచ్చాడు.
2020లో డూగ్రాఫిక్స్ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించిన భగత్, మార్కెటింగ్, సోషల్ మీడియా, వెబ్ డిజైన్ అవసరాలకు ఉపయోగపడే గ్రాఫిక్ టెంప్లేట్స్ వేదికను రూపొందించాడు. కొవిడ్ కారణంగా ఊరికి తిరిగి వెళ్లాల్సి వచ్చినా, అదే తన బలంగా మార్చుకుని గ్రామ యువతకు ఉద్యోగాలు ఇచ్చాడు. పశువుల కొట్టంలో మొదలైన ఆఫీస్, కాలక్రమేణా వేలాది యూజర్లను సంపాదించింది. షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3లో పెట్టుబడులు రావడంతో కంపెనీ మరింత ఎదిగింది. నేడు ఏఐపై దృష్టి పెట్టి, మహాభారతం ఆధారంగా వెబ్‌సిరీస్ రూపొందిస్తున్న భగత్ కథ, ప్రయత్నం ఆగకపోతే పరిస్థితులు ఎలా మారతాయో చెప్పే సజీవ ఉదాహరణ







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!