

ముషీరాబాద్ రాంనగర్లో నివసిస్తున్న ప్రేమ్‌కుమార్ (36) న్యూడ్ ఫోటో మార్ఫింగ్‌తో కూడిన ఆన్లైన్ బ్లాక్మెయిల్ కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తుతెలియని నేరగాళ్లు అతనికి మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫోటోలు పంపుతూ, వెంటనే రూ.3,000 చెల్లించకపోతే కుటుంబ సభ్యుల న్యూడ్ ఫోటోలు, వీడియోలు పంపిస్తామని బెదిరించినట్లు సమాచారం.
ఈ బెదిరింపుల నేపథ్యంలో బాధితుడి భార్య నాగవేణి, కుటుంబ సభ్యులు ధైర్యం చెబుతూ డబ్బులు పంపొద్దని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించినప్పటికీ, నిరంతర వేధింపులతో ప్రేమ్‌కుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అనంతరం అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ బ్లాక్‌మెయిల్‌కు భయపడకుండా వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!