
న్యూస్

పశ్చిమాసియాలో యుద్ధంతో ఏర్పడిన పరిస్థితుల కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధించబోతున్నట్లు వార్తలు వచ్చి ఉండటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో నిర్వహించిన అత్యున్నత స్థాయి వర్చువల్ సమావేశంలో, ప్రస్తుతానికి లాక్‌డౌన్ గురించి ఎలాంటి ఆలోచనలూ లేదని ఆయన స్పష్టం చేశారు.
సమావేశంలో ప్రధాని మోదీ ఎల్పీజీ, పెట్రోల్, ఎరువుల సరఫరా పరిస్థితులను సమీక్షించారు. వ్యాపార స్థిరత్వం, ఇంధన భద్రతపై కీలక సూచనలు ఇచ్చి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమ్ ఇండియాగా పనిచేస్తూ పశ్చిమాసియాలోని యుద్ధ ప్రభావాలను అధిగమించాలని పిలుపునిచ్చారు. కరోనా కాలంలో అనుభవించిన విధంగా ఈ కఠినమైన పరిస్థితిని సామరస్యంతో ఎదుర్కోవాలని ప్రధాని సూచించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!