
న్యూస్

మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ కీలక వివరాలు వెల్లడించారు. అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో మొత్తం 296 స్థానాలకు 1906 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అస్సాంలో 126 స్థానాలకు 722 మంది, కేరళలో 140 స్థానాలకు 890 మంది, పుదుచ్చేరిలో 30 స్థానాలకు 294 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఈ మూడు రాష్ట్రాల్లో ఈ నెల 9 న పోలింగ్ జరగనుంది. అదనంగా కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. గోవాలో ఒక స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండగా, కర్నాటకలో రెండు స్థానాలకు 34 మంది బరిలో ఉన్నారు. నాగాలాండ్‌లో ఒక స్థానానికి ఆరుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

%2C_Shri_Hardeep_Singh_Puri_addressing_a_press_conference_on_Swachh_Survekshan_2018%2C_in_New_Delhi_on_May_16%2C_2018.jpg&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!