
న్యూస్

పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ దేశంలోని విమానాశ్రయాల్లో ప్రజా ప్రతినిధులు, విశిష్ట వ్యక్తుల ప్రయాణాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఈ రోజు విడుదల చేసింది. ప్రయాణ సమయంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, విమానయాన సంస్థలు మరియు విమానాశ్రయ అధికారులకు సూచించింది.

ఈ నిబంధనల ప్రకారం సిబ్బంది ప్రజా ప్రతినిధులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి. సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వడం, వేచి ఉండేందుకు ప్రత్యేక విభాగం కల్పించడం, విమానంలో ఎక్కే వరకు సహాయక సిబ్బంది అందుబాటులో ఉంచడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. భద్రతా తనిఖీల సమయంలో నిబంధనల మేరకు సడలింపులు ఇవ్వవచ్చని తెలిపారు. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

.jpg&w=3840&q=75)



















.jpg.webp&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!