
న్యూస్

హాంకాంగ్‌తో జరగనున్న ఏఎఫ్‌సీ ఆసియా కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌కు ముందు, కొచ్చి జవహర్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ స్టేడియంలో ప్రాక్టీస్ కోసం ప్రధాన కోచ్, ముగ్గురు ఆటగాళ్లను అనుమతించకపోవడం వివాదాస్పదమైంది. దీని కారణంగా మ్యాచ్ ముందు జరగాల్సిన మీడియా సమావేశం రద్దయింది. ఫుట్‌బాల్ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తాయి.
అలిండియా ఫుట్‌బాల్ సంఘం కొన్ని బాకీ చెల్లింపులు చేయకపోవడం వల్ల సిబ్బంది వారిని లోపలకి అనుమతించలేదని తెలుస్తోంది. కొచ్చి ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు దీనిని చిన్న సాంకేతిక సమస్యగా పేర్కొని, ఆటగాళ్లు షెడ్యూల్ ప్రకారం ప్రాక్టీస్ చేయగలరని హామీ ఇచ్చారు. ఆసియా కప్ క్వాలిఫయర్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని ఆయన తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!