
న్యూస్

బాలీవుడ్ నటి యామీ గౌతమ్ తన భర్త ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్ 2 ది రివెంజ్’ విజయాన్ని ప్రేక్షకులతో కలిసి థియేటర్‌లో ఎంజాయ్ చేశారు. ఈ నెల 19న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తూ వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరింది. ముంబైలోని రద్దీ థియేటర్‌లో తన సోదరి సురిలీ గౌతమ్‌తో కలిసి సినిమా చూస్తూ, ఎవరూ గుర్తుపట్టకుండా ముఖాన్ని దాచుకుంటూ జాగ్రత్తగా ఉన్నారు.
సినిమాలో నర్సుగా చిన్న పాత్రలో కనిపించిన సమయంలో ఆమె సోదరి వీడియో తీయడంతో యామీ ఒక్కసారిగా సిగ్గుపడ్డారు. ఆ క్షణాన్ని దాచుకునే ప్రయత్నం చేసిన ఆమె వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ గూఢచారి కథాచిత్రం ఈ సంవత్సరం అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచింది.


.webp&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!