

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందిన ‘బైకర్’ మూవీ వచ్చే నెల 3 న రిలీజ్ అవుతుంది. వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని అభిలాష్ రెడ్డి దర్శకుడిగా రూపొందించారు. డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రలో, మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించారు. రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులలో మంచి బజ్‌ను క్రియేట్ చేశారు.
‘మిట్స్’ ఈవెంట్‌లో మాట్లాడుతూ శర్వానంద్. జీవితం సినిమా లాంటి స్థితిలో కాకపోయినా, కష్టాలు, ఒంటరితనం, అస్పష్టత లాంటివి తప్పకుండా ఎదురవుతాయని, వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలని విద్యార్థులకు స్ఫూర్తి ఇచ్చారు. తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తే పిల్లలు ఏదైనా సాధించగలరని, ప్రతి ఒక్కరు పెద్ద కలలు కనాలని సూచించారు. మాళవిక నాయర్ మాట్లాడుతూ. ‘బైకర్’ యువతకు ధైర్యం, స్పూర్తినిచ్చే సందేశంతో ఉంటుందని, ప్రతి ఒక్కరు సినిమాను చూడాలని అభ్యర్థించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!