
గాసిప్స్

టెన్నిస్ ప్రపంచాన్ని తీవ్ర విషాదం కమ్ముకొంది. ఇటలీ దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు, రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ (1959, 1960) ఛాంపియన్ నికోలా పియట్రాంగెలీ 92 ఏళ్ల వయసులో సోమవారం కన్నుమూశారు. ఆయన మరణ వార్తను ఇటలీ టెన్నిస్ ఫెడరేషన్ అధికారికంగా ధ్రువీకరించింది.
1933 లో ట్యునీషియా లో జన్మించిన నికోలా పియట్రాంగెలీకి తండ్రి ఇటాలియన్, తల్లి రష్యన్. తన కెరీర్లో 44 సింగిల్ టైటిల్స్ సాధించిన ఆయన ప్రపంచ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఏకైక ఇటాలియన్ ప్లేయర్ కావడం విశేషం.
ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే ఇటలీ అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారులు, సినీ-రాజకీయ రంగ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఘనంగా నివాళులర్పిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!