
సినిమాలు

తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా ఈనెల 11, 2026 ఉదయం 11:30 గంటలకు లోక్ భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
అలాగే ఈనెల 16 వ తేదీ ఉదయం 11:45 గంటలకు ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంతో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు అధికారిక ప్రారంభం కానుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!