

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి కొత్త సర్కార్‌ను ఏర్పరుచుకుంది. మిత్రపక్షం జేడీయూ నేత నితీష్ కుమార్ పదోసారి బిహార్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ కుమార్‌తోపాటు మొత్తం 27 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
రెండు దశాబ్దాల తర్వాత నితీష్ కుమార్ కీలకమైన హోంమంత్రి పదవిని బీజేపీకి అప్పగించడం విశేషంగా నిలిచింది. దీనివల్ల కూటమి ప్రభుత్వంలో బీజేపీ పట్టు సుస్పష్టమవుతూ, డ్రైవింగ్ సీటు వైపున అడుగులు వేస్తోంది అని రాజకీయ విశ్లేషకులు చెప్పుతున్నారు.
ఇప్పటివరకు నితీష్ కుమార్ వద్ద ఉన్న హోంమంత్రి పదవిని బిహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి పొందారు. మరో డిప్యూటీ విజయ్ కుమార్ సిన్హాకు గనులు, భూగర్భ శాస్త్ర శాఖలతో పాటు భూమి మరియు రెవెన్యూ శాఖలు అప్పగించబడ్డాయి. మంగళ్ పాండే ఆరోగ్య మరియు న్యాయ శాఖలను, దిలీప్ జైస్వాల్ పరిశ్రమ మంత్రిగా నియమితులయ్యారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!