
గాసిప్స్

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 227 వార్డుల్లో బీజేపీ 89 స్థానాల్లో గెలుపొందగా, శివసేన (షిందే వర్గం) 29 సీట్లు సాధించింది. ఈ రెండు పార్టీల కలిపి 118 స్థానాలు దక్కించుకోవడంతో ఎన్డీఏకు మేయర్ పీఠం లభించింది.
అటు ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే శివసేన (యూబీటీ) 65 సీట్లు, ఎంఎన్ఎస్ 6 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 24, ఏఐఎంఐఎం 8, ఎన్సీపీ 3, సమాజ్వాదీ పార్టీ 2, ఎన్సీపీ (ఎస్పీ) ఒక్క సీటులో విజయం సాధించాయి. ఈ ఫలితాలు ముంబై స్థానిక రాజకీయాల్లో ఎన్డీఏ బలాన్ని మరోసారి స్పష్టంగా చూపిస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!