
సినిమాలు

కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా వామపక్ష కార్మిక, రైతు సంఘాలు నేడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. విద్యుత్ బిల్లు-2025, విత్తన బిల్లు-2025, వీబీ-జీ రామ్ జీ - 2025లను రద్దు చేయాలని, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని, సీమ్ వర్కర్లు సహా అన్ని కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ప్రధాన డిమాండ్లుగా ప్రకటించారు.
కేంద్ర కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ట్రేడ్ యూనియన్ కార్మికులతో కలిసి పాల్గొనాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) రైతులకు విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!