
సినిమాలు

అమెరికా భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఈ నెల12 న దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహించనున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ ఒప్పందం వల్ల భారతీయ రైతులు, పాడి రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతు నాయకులు స్పష్టం చేస్తున్నారు. దీనితో వ్యవసాయ రంగంలో ఆందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు రైతు సంఘాలు బిగ్ అలర్ట్ జారీ చేశాయి.
అఖిల భారత కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా సంయుక్తంగా ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నెల 12 న దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. అన్ని రాష్ట్రాల్లోని రైతులు, కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని సంఘాల నేతలు కోరారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!