

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో సరికొత్త కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్కూల్ విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత పెంచడంతో పాటు క్రమశిక్షణను పర్యవేక్షించేందుకు ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ కార్యక్రమాన్ని 1 వ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని తరగతుల్లో వెంటనే అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాలు, అలాగే కళాశాలల్లో కూడా ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆదేశించింది. పార్వతీపురం మన్యం జిల్లా లో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి విజయవంతంగా అమలు చేయగా, మంచి ఫలితాలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ముస్తాబు కార్యక్రమం అమలు విధానం, నిబంధనల పై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తూ, పిల్లల్లో పరిశుభ్రత అలవాట్లు, క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వ లక్షణాలు పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.


.png&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!