
న్యూస్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఇప్పటికే మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ, భద్రత, లాజిస్టిక్స్ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలనే దిశగా అధికారులు ఆలోచిస్తున్నారని సమాచారం.
మరోవైపు ఇవాళ బల్దియాలు, వార్డులు ఏయే వర్గాలకు రిజర్వ్ అయ్యాయనే అంశంపై తుది ప్రకటన వెలువడనుంది. ఇదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల కోసం ఎన్నికల కమిషన్ ఇప్పటికే 75 గుర్తులను విడుదల చేసింది. గతంలో సర్పంచ్ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించిన నేపథ్యంలో, ఈసారి మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!