
గాసిప్స్

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడి) నూతన కార్యనిర్వాహక అధికారిగా (ఈవో) ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను అధికారికంగా నియమించగా, గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం క్షేత్ర సంప్రదాయం ప్రకారం వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి సన్నిధికి చేరుకుని స్వామి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేసి ఈవోగా బాధ్యతలు చేపట్టారు.
రంగనాయక మండపంలో ఇన్చార్జి ఈవో వెంకయ్య చౌదరి నుంచి అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన రవిచంద్రకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. టీటీడిపై ప్రభుత్వం ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని ముద్దాడ రవిచంద్ర తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!