

భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘన కారణంగా వార్తల్లో నిలిచారు. కొద్దిరోజుల క్రితం ధోనీ పేరిట రిజిస్టర్ అయిన ఓ వాహనం రాంచీలో వేగపరిమితిని మించి ప్రయాణించినట్లు గుర్తించారు. ఆటోమేటెడ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ (ATMS) ద్వారా ఈ ఉల్లంఘన నమోదవడంతో మోటార్ వెహికిల్స్ యాక్ట్ సెక్షన్ 183 కింద రూ.1000 జరిమానాతో ట్రాఫిక్ పోలీసులు ఈ-చలాన్ జారీ చేశారు.
ఈ ఘటన ధోనీ నివాసానికి సమీప ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. సాధారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నా, ధోనీ పేరు రావడంతో సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారింది. ఇదే సమయంలో గతంలో కూడా రాంచీలోని హార్ము రోడ్లో ఉన్న ఆయన పాత నివాస స్థలాన్ని వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించారని ఆరోపణలు రావడంతో జార్ఖండ్ స్టేట్ హౌసింగ్ బోర్డ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ స్థలం నివాస ప్రయోజనాలకే కేటాయించబడిందని అధికారులు పేర్కొన్నారు.





.png&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!