

మేఘాలయ రాష్ట్ర రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. షిల్లాంగ్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ, వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ (VPP) కీలక నేత రికీ ఆండ్రూ జె.సింగ్కాన్ (Ricky Andrew J. Syngkon) కన్నుమూశారు. గురువారం సాయంత్రం మావ్లై మావియోంగ్లోని ఓ మైదానంలో స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూ ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.
అప్రమత్తమైన స్నేహితులు వెంటనే ఆయనను మావియోంగ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జైవ్లోని డాక్టర్ హెచ్ గోర్డాన్ రాబర్ట్స్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ చేసిన జె.సింగ్కాన్, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట్ హిల్ యూనివర్సిటీలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ప్రతిపక్షంలో బలమైన స్వరంగా గుర్తింపు పొందిన ఆయన మృతి పట్ల మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రడ్ సంగ్మాతో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!