
న్యూస్

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో ఫోన్లో మాట్లాడి పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించారు. అక్కడ పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, ప్రాంతీయ పరిస్థితులపై ఇద్దరు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితిపై ఇద్దరూ ఆందోళన వ్యక్తం చేశారని, సమస్యలకు చర్చలు మరియు దౌత్యమే పరిష్కారమని అంగీకరించారని చెప్పారు. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించేందుకు భారత్ – ఫ్రాన్స్ సమన్వయం కొనసాగుతుందని మోదీ తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!