
గాసిప్స్

ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో ప్రపంచ సాకర్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైదానంలోకి దిగారు. ఈ మ్యాచ్ ప్రేక్షకులకు ఉత్సాహాన్ని పంచింది. ఆటలో సీఎం రేవంత్ రెడ్డి ఒక గోల్ నమోదు చేయగా, మెస్సీ రెండు అద్భుతమైన గోల్స్ చేసి అభిమానులను మంత్రముగ్ధులను చేశారు.
మ్యాచ్ అనంతరం మెస్సీ స్టేడియంలో ఉన్న అభిమానులకు చేతులూపి అభివాదం తెలిపారు. ఇరు జట్ల ఆటగాళ్లతో కలిసి మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలు దిగారు. ఈ ప్రత్యేక క్షణాలు అభిమానులకు మరపురాని అనుభూతిని అందించగా, ఉప్పల్ స్టేడియం క్రీడా పండుగ వాతావరణంతో మార్మోగింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!