
న్యూస్

మేడారం మహాజాతరలో హుండీల లెక్కింపు కొనసాగుతోంది. రెండో రోజు మొత్తం 160 హుండీలను అధికారులు లెక్కించగా, వాటి ద్వారా రూ.3,54,25,200 ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. భక్తుల విరాళాలతో మేడారం ఆదాయం రోజురోజుకూ పెరుగుతుండటం విశేషంగా మారింది.
ఇప్పటివరకు రెండు రోజుల వ్యవధిలో మొత్తం 285 హుండీల లెక్కింపు పూర్తవగా, సమగ్రంగా రూ.6,04,53,636 ఆదాయం సమకూరింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చి సమ్మక్క – సారలమ్మలకు మొక్కులు చెల్లిస్తూ విరాళాలు సమర్పించడంతో హుండీల ఆదాయం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు.




.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!