

రాహుల్ గాంధీ కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్)లో పదోన్నతులు, నాయకత్వ నియామకాల విషయంలో సిబ్బందికి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. సీఆర్పీఎఫ్ శౌర్య దినోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతూ, నక్సలిజం, ఉగ్రవాదం వంటి సమస్యలను ఎదుర్కొంటూ దేశానికి సేవలందిస్తున్నా వారికి తగిన గుర్తింపు దక్కడం లేదన్నారు. ముఖ్యంగా నాయకత్వ స్థానాలకు బయటి వ్యక్తులను నియమించడం సిబ్బంది ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తుందని పేర్కొన్నారు.
తాము అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను మార్చి, సీఏపీఎఫ్కు చెందిన వారికే ఉన్నత పదవులు ఇవ్వాలని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సీఏపీఎఫ్లో నియామకాలు, పదోన్నతుల పర్యవేక్షణ కోసం ఏకీకృత వ్యవస్థను తీసుకురావడానికి ఒక బిల్లును ఆమోదించింది. ఈ బిల్లును పార్లమెంటరీ జాయింట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ, లోక్సభ, రాజ్యసభల్లో ఇది ఆమోదం పొందింది.









.jpeg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!