

మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) డిసెంబర్ 2025 ఆన్లైన్ రాత పరీక్ష తేదీని ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (AIMA) అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పరీక్ష షెడ్యూల్‌ను అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. ప్రస్తుతం MAT డిసెంబర్ 2025 కోసం ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుల గడువు డిసెంబర్ 15 (సోమవారం)తో ముగియనుంది.
MAT డిసెంబర్ 2025 ఆన్లైన్ రాత పరీక్ష దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో డిసెంబర్ 21న నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు డిసెంబర్ 18న విడుదల చేయనున్నట్లు AIMA తెలిపింది.
దేశవ్యాప్తంగా ప్రముఖ బిజినెస్ స్కూల్లలో ప్రవేశాల కోసం MAT పరీక్షను సంవత్సరానికి నాలుగు సార్లు ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా MBA, PGDM వంటి మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్లు కల్పిస్తారు. డిసెంబర్ సెషన్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!