
న్యూస్

తిరుపతిలో ఈరోజు విద్యార్థి సంఘాలు భారీ నిరసనకు పిలుపునిచ్చాయి. మోహన్‌బాబు యూనివర్సిటీ (MBU)లో జరుగుతున్న అక్రమాలపై గళం విప్పేందుకు విద్యార్థులు, వివిధ సంఘాల నేతలు రోడ్లపైకి దిగారు. SFI నాయకుల కిడ్నాప్ కేసులో మోహన్‌బాబు, విష్ణులను వెంటనే అరెస్ట్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
అలాగే మోహన్‌బాబు యూనివర్సిటీకి ఇచ్చిన గుర్తింపును రద్దు చేసి, యూనివర్సిటీని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వారు కోరుతున్నారు. విద్యా వ్యవస్థను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నిరసనల నేపథ్యంలో తిరుపతిలో భద్రత కట్టుదిట్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!