

హైదరాబాద్లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దాడులు కలకలం రేపుతున్నాయి. నగరంలోని ప్రముఖ హోటల్స్కు చెందిన యజమానులు, చైర్మన్లు, డైరెక్టర్లు నివాసాల్లో సోమవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 30 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. పట్టణంలో పేరొందిన పిస్తా హౌస్, షాగౌస్, మేహిఫెల్ హోటల్స్ యజమానుల ఇళ్లలో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వందల కోట్లు టర్నోవర్ చూపిస్తున్న ఈ హోటల్స్ వ్యాపార లావాదేవీలను ఐటీ శాఖ సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజేంద్రనగర్లోని పిస్తా హౌస్ యజమానులు మహమ్మద్ మజీద్, మహమ్మద్ ముస్తాన్ నివాసాల్లో నాలుగు ప్రత్యేక బృందాలు డాక్యుమెంట్లు, డిజిటల్ రికార్డులు, ట్రాన్సాక్షన్లను చెక్ చేస్తున్నాయి.
ప్రాథమిక పరిశీలనలో రికార్డ్స్ లో చూపిన ఆదాయం – అసలు ఆదాయం మధ్య వ్యత్యాసాలు, హవాలా అనుమానాలు, నకిలీ లావాదేవీల సూచనలు, సందేహాస్పద ట్రాన్సాక్షన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం.
సోదాలు పూర్తయ్యాక ఐటీ శాఖ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.




.jpg&w=3840&q=75)













.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!