

హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో భారాస శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు సింగరేణి సంస్థలో భారీ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీప బంధువు కోసమే సోలార్ పవర్, ఎక్స్‌ప్లోజింగ్, ప్రకాశం ఖని, శ్రీరాంపూర్ ఓబీల్లో అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ అవకతవకల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తనకు, కేటీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చారని అన్నారు. ఈ అన్ని వ్యవహారాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని డిమాండ్ చేస్తూ లేఖ విడుదల చేశారు.
సింగరేణి టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికేషన్ పేరుతో కుంభకోణం బయటపడిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టుల్లో 107 మెగావాట్లకు ఒకే టెండర్ పిలిచి, ఎంఎస్ఎంఈలు పాల్గొనకుండా నిబంధనలు పెట్టి తమకు అనుకూల సంస్థలకు లాభం చేకూర్చారని ఆరోపించారు. రామగుండంలో జరిగిన సోలార్ స్కాంలో సుమారు రూ.250 కోట్ల అదనపు లాభం కల్పించారని, మరో 67 మెగావాట్ల ప్రాజెక్టులో కూడా ఇదే తరహా అక్రమాలు జరిగాయని అన్నారు.
అలాగే జిలెటిన్ స్టిక్స్ కొనుగోళ్లలో అధిక ధరకు కొనాలన్న ఒత్తిడితో ఒక డైరెక్టర్ రాజీనామా చేయగా, మరో డైరెక్టర్‌ను పదవి నుంచి తగ్గించారని తెలిపారు. ప్రకాశం ఖని, శ్రీరాంపూర్ ఓబీల టెండర్లలోనూ వాయిదాలు వేసి అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. ఈ అన్ని టెండర్లను వెంటనే రద్దు చేసి, స్వతంత్ర దర్యాప్తు జరపాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!