
టెక్నాలజీ

కేరళలోని కొల్లం తీరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫిషింగ్ పడవలోని కిచెన్లో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే భారీగా వ్యాపించి, పక్కనే నిలిపిన ఇతర పడవలకు చేరాయి. ఈ ప్రమాదంలో రెండు ఫిషింగ్ బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే పడవలు దగ్ధం కావడంతో భారీ ఆస్తినష్టం జరిగింది.
ఈ ఘటనతో జాలర్లు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!