
బిజినెస్

మారేడుమిల్లి అడవుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా బలగాలు మరియు మావోయిస్టుల మధ్య తీవ్రంగా జరిగిన ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టు కీలక నాయకులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. మారేడుమిల్లి లోతట్టు అడవుల్లో అగ్రనేతలు తలదాచుకుని ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం పోలీసులకు చేరడంతో, పెద్ద ఎత్తున భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆపరేషన్ చేపట్టాయి. దీంతో రెండు వర్గాల మధ్య భారీగా కాల్పులు ప్రారంభమయ్యాయి.
ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టు టాప్ లీడర్లు దుర్మరణం పాలయ్యారని తెలుస్తోంది. అయితే మరణించిన వారి వివరాలు, ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం అధికారికంగా ఇంకా వెల్లడించాల్సి ఉంది.









.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!