

తమిళనాడులో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న సంప్రదాయ జల్లికట్టు పోటీల్లో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. మధురైలో అట్టహాసంగా ప్రారంభమైన జల్లికట్టు వేడుకల్లో ఎద్దులు విరుచుకుపడటంతో మైదానం రక్తంతో తడిసింది. ఈ ఘటనలో మొత్తం 52 మంది గాయపడగా, వారిలో 10 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. పోటీల ప్రారంభం నుంచే గిత్తలు అత్యంత వేగంగా దూసుకువచ్చి, వాటిని నియంత్రించేందుకు యత్నించిన యోధులపై దాడి చేయడంతో ఈ ప్రమాదం జరిగింది.
గాయపడిన వారిలో ఎద్దులను అదుపులోకి తీసుకునే క్రమంలో 27 మంది బుల్ టేమర్స్కు గాయాలయ్యాయి. తమ ఎద్దులను బరిలోకి తీసుకెళ్లే సమయంలో 20 మంది యజమానులు గాయపడ్డారు. అదనంగా, ఏడుగురు ప్రేక్షకులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్య శిబిరాలకు తరలించగా, తీవ్రంగా గాయపడిన 10 మందిని మెరుగైన చికిత్స కోసం రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఉన్నప్పటికీ, ఎద్దుల వేగం ముందు ప్రమాదాన్ని పూర్తిగా నివారించలేకపోయినట్లు అధికారులు తెలిపారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!