
సినిమాలు

ప్రపంచ వాతావరణంలో భారీ మార్పులకు దారితీసే ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావం పెరుగుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ సముద్రం వేడెక్కుతున్న నేపథ్యంలో దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపించే అవకాశముందని తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రభావం 2027 వరకు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.
దీని కారణంగా భారతదేశంలో వర్షపాతం తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. మరోవైపు దక్షిణ అమెరికాలో భారీ వర్షాలు, ఆసియా దేశాల్లో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో అసమతుల్యతలు పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!