
క్రీడలు

అసభ్యకరమైన పదజాలంతో వీడియో చేసిన ఆరోపణల నేపథ్యంలో యూట్యూబర్ అన్వేష్‌పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, వివాదం తర్వాత అన్వేష్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఇటీవల బ్లాక్ చేశారు.
తనకు రెండు ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, రెండు యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయని అన్వేష్ ఇటీవల వీడియోలో పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరిన్ని వివరాల కోసం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సంస్థలకు పోలీసులు లేఖ రాయడానికి సిద్ధమవుతున్నారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!