

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల సంరక్షణపై సుదీర్ఘంగా ప్రసంగిస్తూ “జలమే జీవం, జీవమే జల సంరక్షణకు మూలం” అనే చైతన్యాన్ని ప్రతి ఒక్కరిలో రావాలి అని తెలిపారు. భూమిపై మనిషికి అవసరమైన నీటి శాతం తక్కువగా ఉందని, దాన్ని జాగ్రత్తగా కాపాడకపోతే భవిష్యత్తు తరాలకు అన్యాయం అవుతుందని హెచ్చరించారు. కానూరు లోని ఏపీఎస్ఐఆర్డీ భవన్‌లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థపై వర్క్‌షాప్ ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి వర్క్‌షాప్ ప్రారంభం జ్యోతి ప్రకాశనతో చేశారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నీరు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి బాగుంటుంది, ప్రజల జీవన స్థితి మెరుగుపడుతుంది. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార వంటి నదులు రాష్ట్ర అభివృద్ధికి జీవనాధారం అని తెలిపారు. ఉపరితల, భూగర్భ జలాలను జాగ్రత్తగా కాపాడటం, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలను పరిష్కరించడం ముఖ్యమని, ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు. నీటి సంరక్షణ చర్యలు వేగవంతం చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు భరోసా ఇవ్వగలమని అన్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!