

రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో భారీ స్థాయిలో సౌరవిద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని చెప్పారు. ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు భవిష్యత్తులో ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేలా ట్రాన్స్‌మిషన్ లైన్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ విషయాలు సచివాలయంలో జరిగిన 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో వెల్లడయ్యాయి.
ఈ సమావేశంలో పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో రూ. 39,436.84 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. 31 ప్రాజెక్టుల ద్వారా 1,11,278 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలో 325 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిని స్టేట్, సెంట్రల్ గ్రిడ్‌లకు అనుసంధానం చేయడంతో పాటు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. అలాగే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను అభివృద్ధి చేయడం, జీసీసీలను ప్రోత్సహించడం, వ్యవసాయ వ్యర్థాలను వినియోగించి పర్యావరణ హిత ఉత్పత్తులు తయారు చేయాలని పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!