
గాసిప్స్

కిరణ్ అబ్బవరం న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ తన కేఏ ప్రొడక్షన్స్‌పై సుమైర స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. వి. మునిరాజు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్‌తో మూవీ లవర్స్‌లో మంచి ఆసక్తి నెలకొంది. మంచి నటీనటులు, టెక్నికల్ టీమ్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుందని భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!